అమెరికా వాణిజ్య నిర్ణయాలు: భారతీయ వ్యవసాయంపై ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు, ముఖ్యంగా భారతదేశంపై సుంకాల పెంపు, దేశీయ ఎగుమతులను మాత్రమే కాకుండా.. భారత రైతాంగాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికా నుండి దిగుమతి అవుతున్న చౌక ఉత్పత్తులు మన మార్కెట్‌ను ముంచెత్తే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల దేశీయ రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. ట్రంప్ ఒత్తిడి కారణంగా భారత ప్రభుత్వం ఇటీవల విదేశీ పత్తి దిగుమతులపై 11% సుంకాన్ని తాత్కాలికంగా తొలగించింది. ఈ నిర్ణయం అమెరికన్ పత్తికి భారత మార్కెట్‌లోకి సులభంగా ప్రవేశించే మార్గాన్ని సుగమం చేసింది. ప్రస్తుతం, విదేశీ పత్తి క్యాండీ ధర రూ. 50,000-51,000 మధ్య ఉండగా దేశీయ పత్తి ధర రూ. 56,000-57,000 మధ్య ఉంది. భవిష్యత్తులో కొత్త కనీస మద్దతు ధర (MSP) రూ. 61,000గా నిర్ణయించబడితే చౌక పత్తి మన రైతులకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. 'పత్తి ధర వ్యత్యాసం చూస్తే.. విదేశీ పత్తి రూ. 50-51 వేలు, దేశీయ పత్తి రూ. 56-57 వేలుగా ఉంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0