ఘనంగా ఇర్రిపాక గ్రామ టిడిపి అధ్యక్షులు జ్యోతుల నాగబాబు పుట్టినరోజు వేడుకలు*
కాకినాడ జిల్లా జగ్గంపేట ఆగస్టు 31: పల్నాటి సాక్షి హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ స్థానిక రావులమ్మ నగర్ లోని టిడిపి కార్యాలయంలో జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నాగబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ నా పితృ సమానులు జ్యోతుల నెహ్రూ, నా సోదర సమానులు జ్యోతుల నవీన్ సమక్షంలో పుట్టిన రోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అదే విధంగా నాకు సోషల్ మీడియా ద్వారా ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి ఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, పోతుల మోహనరావు, దేవరపల్లి మూర్తి, భూపాలపట్నం ప్రసాద్, మండపాక అప్పన్న దొర, బస్వా చినబాబు, గంటా రమణ, బద్ది సురేష్, బోళ్ల సతీష్, అధిక సంఖ్యలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0