గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా-ఎస్సై ఎస్ లక్ష్మికాంతం*

Aug 27, 2025 - 20:54
 0  9
గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా-ఎస్సై ఎస్ లక్ష్మికాంతం*
గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా-ఎస్సై ఎస్ లక్ష్మికాంతం*

ప్రత్తిపాడు/పల్నాటి సాక్షి జిల్లా ఎస్పీ బిందు మాధవ్ జి బిందు మాధవ్ ఆదేశాలతో,పెద్దాపురం డిఎస్పి శ్రీహరి రాజు సూచనలతో,ప్రత్తిపాడు సిఐ బిఎస్ అప్పారావు పర్యవేక్షణలో ప్రత్తిపాడు ఎస్సై ఎస్సై లక్ష్మీకాంతం మండలంలోని గ్రామాల్లో వినాయక చవితి సందర్భంగా నిర్వహించనున్న గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా డ్రోన్ కెమెరాలతో తన సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు.మండలంలో వినాయక మండపాల వద్ద గణేష్ మండప నిర్వహకులకు ఎస్సై లక్మి కాంతం పలు సూచనలు చేశారు. మండలంలో 116 విగ్రహాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని,గణేష్ విగ్రహం ప్రతిష్టించే ముందు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని,అగ్ని ప్రమాదాలు జరగకుండా విద్యుత్, దీపారాధన వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని,మండపాల వద్ద రాత్రి భద్రతగా కాపలా ఉండాలని,అసభ్య నాట్యాలు,మద్యం,మత్తు పదార్థాలు నిషేధమని,పోలీసులు అనుమతి లేకుండా డీజేలు,బాణాసంచా వాడరాదని,ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని,ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై అన్నారు.నిరంతరం డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా,పర్యవేక్షణతో పాటు నిమజ్జనం జరిగే వరకు పోలీస్ బందోబస్తు కొనసాగుతుందని, మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా చట్టపరమైన చర్యలు తప్పమని హెచ్చరించారు. ఈ పర్యవేక్షణలో ఎస్సైతో పాటు గోవింద్,

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0