స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి..* మండల అధ్యక్షుడు సిద్దన రమేష్..*

Aug 31, 2025 - 18:06
 0  3
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి..*    మండల అధ్యక్షుడు సిద్దన రమేష్..*

చెన్నారావుపేట /పల్నాటి సాక్షి చెన్నారావుపేట మండలం బొజేరువు గ్రామం పుల్లయ్య బోడు తండాలో నూతన గ్రామ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం మరియు ఈరోజు పుల్లయ్య బొడు బొజేరువు గ్రామాల్లో నూతన కమిటీల నియామకల్లో భాగంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్ మాట్లాడుతూ చెన్నారావుపేట మండలంలో ప్రతి గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని పనిచేయాలని సూచించారు ..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు బొజేరువు నూతన గ్రామ కాంగ్రెస్ కమిటీని ఏకగ్రీవంగా పాయిరాల ఐలయ్యను ఎన్నుకున్నారు ...పుల్లయ్య బోడు గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈర్యా నాయక్ ని కొనసాగిస్తూ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది....ఈ సందర్భంగా సిద్దన రమేష్ మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు రైతులకు మాయ మాటలు చెప్పి రోడ్ల పైన బటాయించి ధర్నాలు నిర్వహిస్తున్నారని రానున్న ఎన్నికలకు ముందే బి ఆర్ ఎస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని 20 నెలలు మాయమైన నాయకులు ఎన్నికల ముందు ప్రత్యక్షమైనారని ప్రజలను రైతులను మభ్య పెట్టేందుకే ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు.. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రండి కలిసి కేంద్రం పైన కొట్లాడుదామని సవాలు విసిరారు..కానీ ఎన్నికల్లో ఓటమి భయం తో రైతులని రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రజలు ఆందోళన చెందొద్దని ప్రతి రైతుకు యూరియా సమృద్ధిగా లభిస్తుందన్నారు..ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్ జిల్లా కార్యదర్శి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మోగిలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీపీ కేతిడి వీరా రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పేట రమేష్ మండల ఉపాధ్యాక్షుడు ఈర్యా నాయక్ మండల కార్యదర్శి లు భూక్య మోహన్ నాయక్ చెవ్వ వెంకన్న మాజీ ఎంపీటీసీ జిల్లా మహిళ కాంగ్రెస్ కార్యదర్శి రమ బాయ్ మైబు సింగ్ రాథోడ్ బ్లాక్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య భాస్కర్ సొసైటీ డైరెక్టర్ మజ్జిక రాంబాబు మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు అమీరొద్దీన్ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండి హరీష్ మండల ప్రచార కార్యదర్శి మాధారపు చరణ్ కుమార్ కుండే కుమారస్వామి ఆయా గ్రామాల అధ్యక్షులు శంకర్ నాయక్ మాజీ అధ్యక్షుడు రాధారపు భిక్షపతి మాజీ ఉప సర్పంచ్ కుసుమ సతీష్ సారయ్య నూకల సాంబరాజు యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కందిక ప్రవీణ్ కుమార్ ఎస్టీ సెల్ మండల ఉపాధ్యక్షుడు గుగులోత్ నాని రమేష్ రాజు నరేష్ నరిసంహ యాకయ్య భద్రు ఈర్యా కిషన్ తదితరులు పాల్గొన్నారు....

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0