గోకుల్ మిషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స వైద్య శిబిరం

Sep 2, 2025 - 16:45
 0  2
గోకుల్ మిషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స వైద్య శిబిరం
గోకుల్ మిషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స వైద్య శిబిరం

మాచవరం /పల్నాటి సాక్షి మండల పరిధిలోని మొర్జంపాడు గ్రామ పశువైద్యశాల పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ, రాష్ట్రీయ గోకుల్ మిషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా 22 పశువులకు సూడి పరీక్షలు 30 తిరగకట్టు గేదెలకు వైద్యం 12 గర్భకోశ వ్యాధి గేదెలకు చికిత్స 18 ఎదకురాని గేదెలకు చికిత్స చేయడం జరిగింది మొత్తం 82 గేదెలకు పరీక్ష చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది అలాగే వీటితోపాటు ఖనిజ లవణ మిశ్రమము, జలగమందు రోగం మందు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేబ్రోలు పశుగణాభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వై సుధాకర్ రైతులకు పశుపోషణ మరియు లింగ నిర్ధారిత వీర్యం గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లుట్ల గ్రామ సర్పంచ్ లఘుమవరపు సాంబశివరావు శివపార్వతి ఎంపీటీసీ కొక్కెర అంజమ్మ వీరస్వామి డాక్టర్ వై సుధాకర్ డిప్యూటీ డైరెక్టర్ పశుగణాభివృద్ధి సంస్థ చేబ్రోలు డాక్టర్ బి శ్రీనివాస రావు అసిస్టెంట్ డైరెక్టర్ నడికుడి ప్రాంతీయ పశు వైద్యశాల డాక్టర్ ఎన్ ప్రవీణ్ కుమార్ పశు వైద్యాధికారి గ్రామీణ పశు వైద్యశాల మొర్జంపాడు, యానిమల్ హస్బండ్రీ అసిస్టెంట్లు,గోపాల మిత్రులు పాల్గొనడం జరిగింది

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0