విఘ్నాలు తొలగించు.. శుభాలు కలిగించు - భక్తజన ప్రియం.. గణనాథం
రెంటచింతల,పల్నాటి సాక్షి : గణనాథుని చల్లని చూపుతో విఘ్నాలు తొలగి శుభాలు కలగాలని ప్రార్థిస్తూ గణనాథంతో భక్తజనం వినాయక చవితి పర్వదినాన్ని వాడవాడలా వైభవంగా జరుపుకున్నారు. చవితి సందర్భంగా నిర్వాహకులు మండలంలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రమైన రెంటచింతలలో అధిక సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేసి గణేష్ ప్రతిమలను ప్రతిష్ఠించారు. రహదారుల వెంట గణనాధుని ప్రతిమలు విక్రయించేందుకు సిద్ధం చేసి ఉండటంతో కొనుగోలుదారులతో పండుగ సందడి మొదలైంది.ఇంటి పూజ గదిలో గణేశుని ప్రతిష్ఠించి వినాయక దండకం పారాయణం చేసి పూజలు చేశారు. అనంతరం భక్తులు సమీపంలోని మండపాల్లో కొలువైన విఘ్నేశ్వరుడిని దర్శించుకుని వినాయక వ్రత పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.జైజై గణేశ.. జై కొడతా గణేశా అంటూ యువత గణేష్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0