ప్రశాంత వాతావరణంలో వినాయకుని నిమజ్జనం కమిటీ వారిదే పూర్తి బాధ్యత.. ఎలాంటి గొడవలు లేకుండా పండగ పర్వదినాన్ని జరుపుకోవాలని విజ్ఞప్తి.. నియమ, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు.. బెల్లంకొండ ఎస్ఐ డి. ప్రవీణ్

Aug 27, 2025 - 20:10
 0  1
ప్రశాంత వాతావరణంలో వినాయకుని నిమజ్జనం   కమిటీ వారిదే పూర్తి బాధ్యత..  ఎలాంటి గొడవలు లేకుండా పండగ పర్వదినాన్ని జరుపుకోవాలని విజ్ఞప్తి..  నియమ, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు..   బెల్లంకొండ ఎస్ఐ డి. ప్రవీణ్

బెల్లంకొండ, పల్నాటి సాక్షి వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలని బెల్లంకొండ ఎస్ఐ డి ప్రవీణ్ సూచించారు. బుధవారం చండ్రారాజుపాలెం గ్రామంలోని వినాయకుని మండపం, దర్శించడం జరిగింది స్వామివారిని దర్శించుకొని మండపాన్ని పరిశీలించి కమిటీ సభ్యులను పిలిపించి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలియజేశారు. తొలుత తప్పనిసరిగా సంబంధిత శాఖల అనుమతి తీసుకోవాలని అన్నారు. ఆయా గ్రామాల లో ఏర్పాటు చేసిన వినాయక మండపాల విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ఐ. ప్రవీణ్ తెలిపారు. అలాగే వినాయక మండపాల నిమజ్జన ఊరేగింపులో డీజే లకు అనుమతి లేదన్నారు.రాత్రి సమయంలో మండపం వద్ద నిర్వాహకులు బస చేస్తూ, పర్యవేక్షణ చేయాలని ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పూజల కోసం మైకులు వినియోగించాలని స్పష్టం చేశారు. అలాగే నిమజ్జనం సమయంలో అనుమతి ఉన్న దారిలోనే నిమజ్జన యాత్రలు జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజా శాంతి భద్రతల పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. నిర్వాహకులు పోలీసుల సూచనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమం చివరగా మండల బీసీ సెల్ అధ్యక్షుడు గుంజా గంగారావు మాట్లాడుతూ బెల్లంకొండ ఎస్ఐ ప్రవీణ్ సూచనలు నిబంధన పాటిస్తామని ఎలాంటి గొడవలకు తావివ్వమని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని కమిటీ తరఫున మాటిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో, గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఓర్చు రాంబాబు పార్లమెంటు బీసీ నెంబరు ఓర్చు, ఆనంద్, లక్ష్మయ్య,కొండ,మహేంద్ర దుర్గారావు, తమ్మిశెట్టి వెంకటగిరి, నితీష్, మణికంఠ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0