రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ

Aug 27, 2025 - 20:24
 0  4
రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ

కర్లపాలెం పల్నాడు సాక్షి ప్రతినిధి ఆగస్టు 27 కర్లపాలెం మండలంలో విడతల వారిగా, అవసరానికి తగ్గట్టుగా యూరియా రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది..ఈ వారం వ్యవధిలో మొత్తం 60 టన్నుల యూరియా మండలానికి మార్క్ఫెడ్ ద్వారా వచ్చింది. 20 టన్నుల యూరియా యాజలి రైతు ఉత్పత్తి దారుల సంస్థ ద్వారా నిన్న పంపిణీ చేయగా 40 టన్నుల యూరియా రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ కొరకు సిద్ధంగా ఉంది.. విడతల వారిగా ఇచ్చే క్రమంలో కొందరు రైతులు యూరియాను అవసరానికి మించి కొనుగోలు చేయడం వలన మిగతా రైతులకు యూరియా అందడం లేదు.. రైతులు యూరియా కొరత ఉండబోతుదనే ఆందోళన చెందకుండా, వ్యవసాయ శాఖ వారికి సహకరించి, అవసరం మేరకు మాత్రమే యూరియా వినియోగించుకోవలసిందిగా కోరడమైనది.. రైతులందరూ ఖరీఫ్ పంట నమోదు సెప్టెంబర్ 15 వ తారీఖు లోపల, గ్రామ వ్యవసాయ సిబ్బందిని సంప్రదించి చేయించు కోవలసిందిగా మనవి అప్పుడే కనీస మద్దతు ధర, సున్నా వడ్డీ పంట రుణాలు, నష్ట పరిహారం, ప్రీమియం కట్టుకున్న వారికి పంటల బీమా వర్తిస్తుంది.. కౌలు దారులు కౌలు కార్డులును గ్రామ స్థాయిలో వ్యవసాయ సిబ్బంది లేదా రెవెన్యూ అధికారుల ద్వారా పొంది ఉండడం ద్వారా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హత పొందవచ్చు అలాగే బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాలు పొందవచ్చు కావున ఇది గమనించి, తక్షణమే కౌలు కార్డులు పొందవలసిందిగా మనవి..

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0