యల్లమిల్లి టిడిపి కార్యకర్త పాక నాగ రాజు కి యల్లమిల్లి టిడిపి ఆధ్వర్యంలో ఆటో అందజేత*
కాకినాడ జిల్లా గండేపల్లి ఆగస్టు 31: పల్నాటి సాక్షి గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పాక నాగరాజుకి గత ఎన్నికల ప్రచారంలో జిల్లా టిడిపి అధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ఆటో అందిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా యల్లమిల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుంకవిల్లి వీర వెంకట సత్యనారాయణ (య ల్లమిల్లి సీఎం) ఆధ్వర్యంలో ఆదివారం నాగరాజు ఆటో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తను ఆదుకున్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకి జ్యోతుల నవీన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాది రెడ్డి కృష్ణ, దేవిశెట్టి బాబ్జి, మద్దిపూడి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0